అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం...

ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న...
జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...
మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్...
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని గద్వాల పట్టణంలోని 22 వార్డ్ లో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు..ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని తెలిపారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు...ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు గంజిపేట్ శంకర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు భాస్కర్ యాదవ్, డిటిడిసి నర్సింహులు, నాగరాజు, ఎల్లప్ప,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,శెట్టి ఆత్మకూరు లక్షణ్,,డి. ఆర్.శ్రీధర్. అల్వాల రాజశేఖర్ రెడ్డి,టిఎన్ఆర్ జగదీష్,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, సమివుల్లా,పాతపాలెం ఆనంద్ గౌడ్,సద్దనోముపల్లి గోపాల్, పెదొడ్డి రామకృష్ణ,వెంకటస్వామి గౌడ్,శెట్టి ఆత్మకూరు కృష్ణయ్య గౌడ్, దడవాయి నర్సింహులు,తుంకుంట కృష్ణయ్య గౌడ్ తదితరులు ఉన్నారు..