కుల గణన సర్వే బకాయిలు చెల్లించని యెడల సామూహికంగా ఎన్నికల విధుల బహిష్కరణ
జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2025తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్ గత సంవత్సరం నవంబర్లో చేసిన కులగణన సర్వే రెమ్యూనరేషన్ బకాయిలను స్థానిక ఎన్నికల లోపు చెల్లించాలని కోరుతూ మల్దకల్ మండల ఎంపీడీవో ఆంజనేయులు రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్వే చేసిన మండల ఉపాధ్యాయులు, పంచాయితీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.