వర్గీకరణతోనే ఎస్సీ ఉపకులాలకు లబ్ధి ఎమ్మార్పీఎస్
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- వర్గీకరణతోనే ఎస్సీ ఉపకులాలకు లబ్ధి ఎమ్మార్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వర్గీకరణక కోసం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ ను రాష్ట్రంలో అమలు చేయాలని సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ కోరారు. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ విచారణ కు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తరూ ను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. .. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణ ద్వారానే ఎస్సీలలోని అన్ని ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ ఎంఎస్పి మండల అధ్యక్షులు వీరమల్ల నవీన్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తిప్పర్తి గంగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పల్లెల రాములు మాదిగ ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి మిర్యాల చిన్ని మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు పిడమర్తి ఉమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యదర్శి ఎడవల్లి కార్తీక్ మాదిగ ఎంఎస్పి అధికార ప్రతినిధి పిడమర్తి శీను మాదిగ ఆరింపులు ముత్తయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.