క్రేడాస్ ఫార్మసీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేటలో క్రేడాస్ ఫార్మసీరెండో బ్రాంచ్ ప్రారంభం
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన మందులను అందిస్తున్న క్రేడాస్ ఫార్మసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్రేడాస్ ఫార్మసీ వేర్ హౌజ్ మేనేజర్ మాధవరావు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మధు ట్రావెల్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడాస్ ఫార్మసీ రెండో బ్రాంచ్ ను పాస్టర్ బొజ్జ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభింపజేసి మాట్లాడారు. క్రేడాస్ ఫార్మసీ ఎండి శ్రీధర్ సారథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన మెడిసిన్ లను అందించేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఈ బ్రాంచ్ ఎనిమిదో బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు బొడ్డు రాజేశ్వరి రామకృష్ణ మాట్లాడుతూ క్రీడేస్ ఫార్మసీ అన్ని రకాల మందులను ప్రజలకు రాయితీ ధరలతో అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. జనరిక్ మెడిసిన్ లో 20% రాయితీ జనరిక్ లో 50%, జనరల్ మెడిసిన్ లో 5% రాయితీని అందించడంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతూ నాణ్యమైన సేవలు అందిస్తున్న క్రీడాస్ ఫార్మసీ బ్రాంచ్ లను సూర్యాపేటలో జిల్లా లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తమ వద్ద అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడస్ ఫార్మసీ సీఈవో బాలాజీ, ఫార్మా సిస్ట్ శ్రీకాంత్, కుమార్ తదితరులు ఉన్నారు.