ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా తెలంగాణ తల్లి విగ్రహం
విద్య వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించాలి
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారులు పంతంగి వీరస్వామి గౌడ్
(సూర్యాపేట టౌన్ డిసెంబర్ 9 )
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవo దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఉందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సామాజిక తెలంగాణ ఉద్యమకారులు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తే అందుకు భిన్నంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహరూపు రేఖలను మార్చడం సరికాదన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన విగ్రహం సాధారణ మహిళ వలే ఉందన్నారు. తెలంగాణ తల్లి అంటే దేవత మూర్తి రూపం పుట్టిపడేలా ఉండాలని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు రుణమాఫీ , ప్రజలకు కావలసిన అన్ని సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యాన్ని కూడా ప్రజలుకు ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేనిఫెస్టో లో చెప్పినట్టు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజములు ఇస్తానని ఇంతవరకు అది అమలు చేయలే తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. వారికి పెన్షన్ మంజూరు చేయాలని వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచడంతోపాటు వైద్యానికి అవసరమయ్యే యంత్రాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకుల పాఠశాలలో భోజనం నాణ్యత లేకపోవడం మూలంగా ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషోర్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ అయిత గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ రాపర్తి జానయ్య పెగె్ పురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.