ప్రజా పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్కృతి కార్యక్రమం
అడ్డగూడూరు 07 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజాపాలన సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు రైతులకు 2లక్షల రుణమాఫీ,ఇందిరమ్మ ఇండ్ల,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,500కి గ్యాస్ సిలిండర్,వివిధ పథకాల గురించి ప్రజా పాలన కళాకారులు పాటలు ద్వారా వినిపించారు