గొట్టిపర్తి లో ఉచిత రక్త శిబిరం ఏర్పాటు
తుంగతుర్తి 11 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో వై ఆర్ జీకేర్ లింక్ వర్కర్ స్కీం నల్గొండ సంస్థ వారు ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్ష శిబిరాన్ని హెచ్ ఈ ఓ రవికుమార్ మేల్ అసిస్టెంట్ యాదగిరి టిబి నోడల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సెకరటరీ శ్రీధర్ రక్త పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం హెచ్ఐవి మీద ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ముఖ్యంగా హెచ్ఐవి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు హెచ్ఐవి నాలుగు విధాలుగా వ్యాపిస్తుందని అందులో అక్రమలైంగిక సంబంధాల ద్వారా, కలుషిత రక్తం మార్పిడి ద్వారా, కలుషిత సూదులు సిరంజిలు వాడటం ద్వారా, హెచ్ఐవి సోకిన గర్భవతి అయిన తల్లి నుంచి ,బిడ్డకు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు కాబట్టి ప్రజలు ఆరోగ్య విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అజాగ్రత్త వహించరాదని సూచించారు. అలాగే టిబి, బీపీ, ఎస్.టి.ఐ వంటి పరీక్షలు కూడా చేయించుకోవాలని ప్రజలకు సూచించారు...