ర్యాలం పాడు రిజర్వాయర్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి:బీజేపీ జిల్లా అధ్యక్షులు
జోగులాంబ గద్వాల 29 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ధరూర్ ర్యాలం పాడు రిజర్వాయర్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి మరియు ర్యాలంపాడు రిజర్వాయర్ 4 టిఎంసిలు నీటిని నింపి రైతులకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వాలి అని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ను మరియు పాలకులను డిమాండ్ చేసారు. సోమవారం మండలం లోని ర్యాలం పాడు రిజర్వాయర్ ను మరియు పంపు హౌస్ పరిశీలించిన బిజెపి జిల్లా నాయకులు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ గద్వాల నుండి హైదరాబాద్ దాక పాదయాత్ర చేసి పోరాటంతో ఆనాడు నెట్టెంపాడు సాధించుకోవడం జరిగింది అని అయన అన్నారు.నెట్టెంపాడు రిజర్వాయర్ రెండు లక్షల ఎకరాలకు నీరు అందించిన డీకే అరుణమ్మ పోరాట ఫలితమే అని అన్నారు.ర్యాలంపాడు రిజర్వాయర్ కు 4 టీఎంసీలు సామర్థ్యం ఉంటే ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వలన అది 1 టిఎంసి కి పరిమితమైందని అన్నారు.ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్ల 90% పనులు పూర్తి చేస్తే 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న నాయకులు 10 శాతం పనులు పూర్తి చేయలేక పోతున్నారు అని మండిపడ్డారు.ఈ 10 శాతం పనులు పూర్తి చేస్తే రైతులకు రెండు పంటలు పండించు కునే విధంగా ఉంటుందని అన్నారు..రాలంపాడు రిజర్వాయర్ వెంటనే మరమ్మత్తులు చేయించి 4 టీఎంసీ నీటిని నిలపాలని చివరి ఆయకట్ట వరకు నీరు అందించాలని అన్నారు.ఆనాడు ర్యాలం పాడు రిజర్వాయర్ ను ప్రారంభించి డికె అరుణమ్మ నాలుగు టీఎంసీలు నీళ్లుఇస్తే ఈనాటి వరకు కాలువలకు మరమ్మత్తులు చేయలేదని ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి చొరవ చూపి కాలువల్లో ముళ్ళ కంపలు తీసి చివరి ఆయకట్టు వరకు నీరందించే విధంగా అధికారులు చొరవ చూపాలని అన్నారు.నెట్టెం పాడు ప్రాజెక్టు ద్వారా ప్రతి ప్యాకేజీ పూర్తి చేయాలని ,గట్టు ఎత్తిపోతల పథకం,99 ప్యాకేజీ పూర్తి చేయాలని అన్నారు.లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిరిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి అయ్యేంతవరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు అన్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నాలుగు టీఎంసీలు నిండితే మూడు మోటార్లు పనిచేయాలని కానీ ఇక్కడ ఒక మోటార్ పనిచేస్తుందని అన్నారు.మోటార్ల దగ్గర పనిచేసిన ఉద్యోగులు ప్రతి సంవత్సరం ఒక ఏజెన్సీకి మారుస్తుండడంతో తక్కువ జీతాలు ఇస్తున్నారని వాళ్లకు ప్రభుత్వం నడిపిస్తే ఎక్కువ ఉద్యోగులు కావాలని ఏజెన్సీకి ఇవ్వడంతో తక్కువ ఉద్యోగులను పెట్టి నడిపించి వాళ్లకు పని కి వేతనం ఇవ్వడం లేదని వీళ్లకు ఏజెన్సీ రద్దుచేసి ప్రభుత్వం ద్వారా సరైన వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి బలిగేర శివారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు మధుసూదనయ్య, దరూర్ కిష్టన్న,దేవదాస్, అనిల్,మర్ల బీడు జనార్దన్ రెడ్డి, మల్లేం దొడ్డి వెంకటేశ్వర రెడ్డి, పాలవాయి రాముడు, గూడూరు నాగప్ప నరసింహ శెట్టి డబ్బిలేటి నరసింహ, మోహన్ రెడ్డి, ఓంకార్, తదితరులు ఉన్నారు..