అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేని మున్సిపల్ అధికారులు
డ్రైనేజ్ పై రెస్టారెంట్ అక్రమ నిర్మాణాన్ని ఆపేదెవరు ?
అక్రమ రెస్టారెంట్ నిర్మాణానికి ఇప్పటివరకు దరఖాస్తు కూడా లేదు
జిల్లా అధికారులైన కల్పించుకుంటే బాగుంటుంది
ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అక్రమ రెస్టారెంట్ నిర్మాణం
కొత్తగూడెం జూలై 29: కొత్తగూడెం మున్సిపాలిటీ 27వ వార్డులో అక్రమంగా డ్రైనేజ్ పై రెస్టారెంట్ నిర్మాణం గత నెల రోజులుగా చురుకుగా పనులు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పత్రికలలో ప్రచురిస్తున్నప్పటికీ అధికారులు ఏటువంటి చర్యలు తీసుకెలేకపోతున్నారు. మున్సిపల్ అధికారులను డ్రైనేజ్ పై అక్రమంగా నిర్మిస్తున్న రెస్టారెంట్ పై చర్యల కొరకు వివరణ కోరగా ఎటువంటి నిర్మాణాలకు గాని రెస్టారెంట్లకు కానీ అనుమతులు ఇవ్వలేదని వారి ఇప్పటివరకు దరఖాస్తు కూడా చేసుకున్న దాఖలాలు లేవని టిపిఓ బదిలీపై వెళ్లినారని నూతనంగా టిపిఓ వచ్చిన తర్వాత మురుగు కాలువ పై అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని కచ్చితంగా తొలగిస్తామని వాటికి ఎటువంటి అనుమతులు లేవని వారన్నారు. అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని మున్సిపాలిటీలో అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేసుకోవాలని అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు జరిగిన ఉపేక్షించేది లేదని ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ కి సహకరించాలని కమిషనర్ కోరుతూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా డ్రైనేజ్ పై రెస్టారెంట్ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ నుండి హెడ్ ఆఫీస్ వెళ్లే రోడ్డు ఇరువైపులా నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా చురుకుగా పనులు సాగుతున్నాయి .ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి డ్రైనేజీల పైన కూడా రెస్టారెంట్లు నిర్మిస్తున్నారని ప్రజల ఆరోగ్యాలు వారికి అవసరం లేదని డబ్బు వారి లక్ష్యం అని మురుగు కాలువలపై ఇటువంటి రెస్టారెంట్లను నిర్మించద్దని వెంటనే ఇటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. ఎవరు ఏమి చేయలేరు అన్న ధీమాతో అక్రమ పద్ధతిలో రెస్టారెంట్ ని నిర్మిస్తున్నారని మరి వీటికి ఎటువంటి అనుమతులు లేవని రావని పలువురు చెబుతున్నారు. మరి ఇటువంటి అక్రమ రెస్టారెంట్లకు అనుమతులు ఉంటాయా ఇది సజావుగానే కొనసాగుతుందా ఒకవేళ అనుమతులు లేకుండానే రెస్టారెంట్లు ప్రారంభిస్తారా మరి వేసి చూడాల్సిందే. చురుకుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న డ్రైనేజ్ పై నిర్మిస్తున్న అక్రమ రెస్టారెంట్. జిల్లా అధికారులు కల్పించుకొని ప్రజలకు ప్రభుత్వం పై ప్రభుత్వ అధికారులపై చులకన తీసివేసే దిశగా పనిచేస్తే బాగుంటుందని పలువురు కోరుచున్నారు.