ఇంటి నుండి వెళ్లిపోయిన యువకుడ్ని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన కేటి దొడ్డి పోలీసులు
జోగులాంబ గద్వాల 29 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- కేటీ దొడ్డి.తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుండి వెళ్లిపోయిన యువకున్ని వెతికి పట్టుకొని తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించిన కేటి దొడ్డి పోలీస్ అధికారులు.ఈ సందర్బంగా ఎస్సై శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలో మల్లాపూర్ తండా చెందిన విజయ్(17) సంవత్సరం లు చెడు వ్యసనాలకు అలవాటు పడినందున తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఆదివారం మధ్యరాత్రి ఆత్మహత్య చేసుకుంటానని ఆ యూవకుడు ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఆ విషయం తెలుసుకున్నా తల్లిదండ్రులు అదే రోజు రాత్రి 100 డైల్ కి ఫోన్ చేయగా వెంటనే మండల పోలీస్ స్టేషన్ చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ కుమార్, హోంగార్డు శ్రీనివాసులు ఇద్దరు వెతికి ఆ యూవకున్ని వెతికి పట్టుకొని సోమవారం వారి తల్లిదండ్రులు అయినా గంగానాయకు అప్పజెప్పడం జరిగింది. అని ఎస్సై శ్రీనివాస్ రావు తెలియజేసారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులకు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎస్సై మండల ప్రజలకు బాలికలు, యువతులు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు 100 కు డయల్ చేస్తే తప్పకుండ సంఘటనా స్థలానికి చేరుకోని సమస్య పరిష్కరిస్తామని మరియు ఆదుకుంటామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ డయల్ 100 పై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.