ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి:ఎన్నికల అధికారి

జోగులాంబ గద్వాల 25 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. మే నెల 13న సార్వత్రిక (లోక్ సభ) ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి బి.యం. సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.గద్వాల నియోజకవర్గంలో పురుషులు 1,25,639 మంది, మహిళలు 1,30,978 మంది, ఇతరులు 11 మొత్తం 2,56,628 మంది ఓటర్లు ఉన్నట్లు, అలాగే అలంపూర్ నియోజకవర్గంలో పురుషులు 1,17,997 మంది, మహిళలు 1,21,074 మంది, ఇతరులు 08 మొత్తం 2,39,079 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఈనెల 26 నుంచి 30 వరకు (05) రోజులపాటు ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు ఓటర్లకు స్లిప్పులు అందజేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.