ప్రమాదవశాత్తు అంటుకున్న గ్యాస్ సిలిండర్...తప్పిన పెను ప్రమాదం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరిత
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గట్టు. మండలo తప్పెట్లమోర్సు గ్రామంలో తలారి బజరన్న ఇంటిలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెల్లరేగాయి ఈ సంఘటనలో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు, ఇంటిలోని నిత్యవసర సరుకులు చేనేత మగ్గం కాలి బూడిదఅయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితమ్మ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును గ్రామ ప్రజలు వారికి వివరించారు. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై మంటలు ప్రయత్నం చేసారన్నారు . అంతలోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారనీ తెలియజేశారు. జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో పెద్ద ప్రమాదమే తప్పిందని ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడం చాలా అదృష్టమని అన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. వీరివెంటా జిల్లా కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ బాబు, అమరవాయి కృష్ణారెడ్డి , మాల శ్రీనివాసులు, యూత్ లీడర్ కొండ పల్లి తిరుమల్, చేనుగొని పల్లి వేణు, వేణుగోపాల్, తప్పెట్ల మోరుసు మాజీ ఎంపీటీసీ ముక్కెరన్న, గద్వాల తిమ్మప్ప, మాజీ సర్పంచ్ నరసింహులు, అరగిద్ద మాజి ఎంపిటిసి, మహమ్మద్ అలీ, బాలకృష్ణ, మల్దకల్ మాజీ ఎంపిటిసి తిమ్మప్ప, పుర నాగన్న, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు