సలేశ్వరం జాతరలో జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసుల సేవలు
జోగులాంబ గద్వాల 25 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- నాగర్ కర్నూల్ జిల్లా సలేశ్వరం బందోబస్తు డ్యూటీలో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు దర్శనానికి వచ్చిన భక్తుడికి ఫిట్స్ రాగ అక్కడే ఉన్న జిల్లా పోలీసులు వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించీ దర్శనానికి వచ్చిన భక్తుడిని ప్రాణాపాయం నుండ కాపాడి సురక్షితంగా పంపించడం జరిగింది. వివరాలు నాగర్ కర్నూల్ జిల్లా లోని సళేశ్వరం జాతర సందర్భంగా జోగుళాంబ జిల్లా నుండి బందోబస్తు నిమిత్తం విధులలో ఉండగా నిన్న తల నిలాలు సమర్పించే ప్రదేశములో దర్శనానికి వచ్చిన చెంచు పెంట కు చెందిన శివ అక్కడే ఫిట్స్ వచ్చి క్రింద పడిపోగా అక్కడె విధులలో ఉన్న జిల్లా కు చెందిన సాయుడ దళ సిబ్బంది వెంకట్రములు, మరియు రాముడు లు వెంటనే స్పందించి ప్రథమ చికిత్స చేసి ప్రాణాపాయం నుండి కాపాడి కొన్ని నిమిషాల తరువాత భక్తుడు మేలుకున్నక సురక్షితంగా వెళ్ళేటట్లు సేవలు అందించడం జరిగింది. అక్కడే ఉన్న ప్రజలు ఈ మొత్తం సంఘటనను చూసి జిల్లా పోలీస్ సిబ్బంది అందించిన సేవల పై ఆనందం వ్యక్తం చేశారు. సలేశ్వరం జాతర లో ప్రమాదం లో ఉన్న భక్తుడికి సేవలు అందించి సురక్షితంగా పంపిన సంఘటన పై జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS సిబ్బందినీ అభినందించారు.