తుంగతుర్తి సభ ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎస్పీ నరసింహ

తుంగతుర్తి 12 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రానున్నారు. దివంగత మాజీ మంత్రి తుంగతుర్తి, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పాల్గొననున్నారు. తుంగతుర్తి లోని స్థానిక జాతీయ రహదారి 365 వద్ద గల స్టేడియంలో సంతాప సభ జరగనున్నది. ఈ సందర్భంగా శనివారం సూర్యాపేట ఎస్పి నరసింహ సంతాప సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ మాజీమంత్రి రామ్ రెడ్డి 11వ రోజు పురస్కరించుకొని ఆదివారం సంతాప సభ తుంగతుర్తి హెడ్ క్వార్టర్ లో నిర్వహించనున్నారని ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు ఇతర క్యాబినెట్ మంత్రులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు రానున్నారని ఆయన తెలియజేశారు. ఈ సంతాప సభకు అభిమానులు దాదాపు 50 వేల మంది రానున్నారని అంచనా వేస్తున్నామని దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఎస్పీ తెలియజేశారు. ఈ సంతాప సభకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నాయకులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించామని తెలియజేశారు. ఆయనతోపాటు దివంగత మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, గుడిపాటి నరసయ్య,సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, గుడిపాటి సైదులు, పోతు భాస్కర్, డిఎస్పి ప్రసన్నకుమార్, సిఐ నరసింహారావు, ఎస్సై క్రాంతి కుమార్, ఆర్డిఓ, తదితరులు పాల్గొన్నారు....