పాలేరు నియోజకవర్గ ఆర్యవైశ్య రాజకీయ చైతన్య సదస్సు

పాలేరు నియోజకవర్గ ఆర్యవైశ్య రాజకీయ చైతన్య సదస్సు
తెలంగాణ వార్త ప్రతినిధి,నేలకొండపల్లి /ఆగస్టు, 3 : ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ పాలేరు నియోజకవర్గ రాజకీయ చైతన్య సదస్సు నేలకొండపల్లి పట్టణ & వర్తక సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో స్థానిక నేలకొండపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో విజయవంతంగా నిర్వహించడం జరిగినది. పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, పొలిటికల్ లీడర్స్ హాజరైనారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ రంగా హనుమంతరావు గారు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ పసుమర్తి సీతా చందర్రావు గారు విచ్చేశారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా చైతన్యవంతులుగా ఉండాలని ఏ పార్టీ నుంచి మన ఆర్యవైశ్యులకు టికెట్ వచ్చిన అందరం కలిసి యూనిటీగా ఆ వ్యక్తిని గెలిపించుకోవాలని మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలతో మమేకమై పేద ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని ఆర్యవైశ్యులలో పేదవారై ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే ఆ నియోజకవర్గస్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ తో మాట్లాడి నాయకులను కలిసి నా వంతుగా మీకు న్యాయం చేస్తానని తెలియపరచారు. పాలేరు నియోజకవర్గంలో పేద ఆర్యవైశ్యులకు రేషన్ కార్డులు గాని, గృహ నిర్మాణంగాని తదితర విషయాల్లో స్థానిక శాసనసభ్యులు, రెవెన్యూ శాఖా మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ద్రుష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కోశాధికారి పసుమర్తి వెంకటేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగుబండి శ్రీనివాసరావు , జిల్లా ముఖ్య సమన్వయకర్త చారుగుండ్ల నరసింహమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాల్వాయి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి పాల్వాయి సీతారామారావు, పొలిటికల్ కో చైర్మన్ మాటూరి సుబ్రమణ్యం, నేలకొండపల్లి మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్, కూసుమంచి మండల అధ్యక్షులు, వేముల శ్రీనివాస్, తిరుమలాయపాలెం మండలం అధ్యక్షులు ఆమంచి దయాకర్, జిల్లా మాజీ అధ్యక్షులు గెల్లా జగన్మోహన్రావు, వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ కనమర్లపూడి రమేష్, మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రేగూరి శ్రవణ్ కుమార్, వందనపు నాగేశ్వరరావు, కొత్త రమేష్ ,బోనగిరి కిరణ్, కొత్తా రాణి, తెల్లాకుల జయశ్రీ, కొత్త కరుణ, కాజా చక్రధర్ రావు తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఆర్యవైశ్య మాజీ సర్పంచులు, మాజీ వార్డ్ మెంబర్లు, సొసైటీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ ఎంపీటీసీలు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ముఖ్యఅతిథి గారికి మరియు అతిధులను సన్మానించడం జరిగినది.