ఆగస్టు 15 తర్వాత పెన్షనర్ల ఆకలి యాత్ర""రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఆగస్టు 15 తర్వాత పెన్షనర్ల ఆకలి యాత్ర. రిటైర్డ్ ఉద్యోగుల విరమణ ప్రయోజనాలను విడుదల చేయకుండా వారిని మానసిక ఆందోళనకు గురి చేస్తున్న ప్రభుత్వ విధానాలు సరికాదని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ కార్యాలయంలో ఉపాధ్యక్షులు జనార్ధన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు న్యాయంగా రావలసిన కమ్యూ టేషన్. గ్రాచుటీ. సరెండర్ లీవ్. అర్జిత సెలవు. జిపిఎఫ్ తదితర లక్షలాది రూపాయలు ఉద్యోగ విరమణ తర్వాత విడుదల కావలసిన ఆర్థిక బకాయిలు 16 నెలలు అయినా విడుదల చేయకుండా పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆవేదనకు ఆందోళనకు గురి చేస్తున్నది అందుకే ఆగస్టు 15 తర్వాత పెన్షనర్ల ఆకలి యాత్ర పేరుతో చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి తాళ్లూరి వేణు మాట్లాడుతూ ఈనెల 7న పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరిగే నిరసన ప్రదర్శనలో పెన్షనర్లు అందరూ పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని పెన్షనర్ల సంఘాలు ఈనెల 11న హైదరాబాదులో ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. పెన్షనర్లు ఐక్యంగా ఉద్యమించకపోతే మరిన్ని రాయితీలు కోల్పోవాల్సి వస్తుందని నాయకుల స్వార్థం కోసం కాకుండా పెన్షనర్ల ప్రయోజనాల రక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాల ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే ప్రయోజనాలు చేకూరుతాయని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి డీకే శర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి సాంబశివరావు కార్యదర్శిలు కాజా మొయినుద్దీన్ కూతురు కృష్ణమూర్తి చెల్లి బాబురావు జగన్మోహన్రావు ఖమ్మం నగర నాయకులు బసవరావు కృష్ణమూర్తి హనుమంతరావు ఆదినారాయణ యు వెంకటేశ్వర్లు గురవయ్య తదితరులు పాల్గొన్నారు.