ఇప్పటి తరం పిల్లలకు డిజిటల్ ఫాస్టింగ్ ఎంతో అవసరము

Mar 21, 2024 - 21:13
 0  4
ఇప్పటి తరం పిల్లలకు డిజిటల్ ఫాస్టింగ్ ఎంతో అవసరము
ఇప్పటి తరం పిల్లలకు డిజిటల్ ఫాస్టింగ్ ఎంతో అవసరము
ఇప్పటి తరం పిల్లలకు డిజిటల్ ఫాస్టింగ్ ఎంతో అవసరము

శిశు వాటిక తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించిన శ్రీ రామకృష్ణ విద్యాలయం నేటి పోటీ ప్రపంచంలో పిల్లల చదువుల బాధ్యత కేవలం పాఠశాల దే అన్న భావన లో పిల్లల తల్లిదండ్రులు ఉన్న తరుణం లో ప్రతీ విద్యార్థికి మొడటి గురువులు తమ తల్లిదండ్రులే అని గుర్తు చేస్తూ ఇంట్లొ వాళ్ళ భాధ్యత, యే విధముగా వాళ్లు పిల్లలతో సమయము కేటాయించాలి, పిల్లలను యే విధముగా మొబైల్ కు దూరం పెట్టాలి అనే అంశాలతో కలిగిన అవగాహన సదస్సు ఘనం గా జరిగింది.

  ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా ప్రముఖ శిశు వైద్యులు డాక్టర్ ఎలమంచిలి నాగమణి గారు విచ్చేశారు. ముఖ్య వక్త గా విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర శిశు వాటిక ప్రముఖ్ శ్రీ కోవెల శ్రీనివాసాచార్యులు గారు వ్యవహరించారు.

 నాగమణి గారు మాట్లాడుతూ పిల్లలకు అందించే ఆహారం పట్ల అవగాహన నేటి తల్లిదండ్రులకు ఉండడం ఎంతో అవసరము అని ఇంద్రధనస్సు లోని రంగుల వలే అన్ని కూరలు తినాలి అని పిల్లలను ప్రోత్సహించాలి అని అన్నారు. మాదక ద్రవ్యాల కంటే కూడా ప్రమధమైనది అంతర్జాలం అని దానికి పిల్లలు వ్యసన పరులు కాకుండ చూసుకోవాలి అని అన్నారు.
వక్త శ్రీ కోవెల శ్రీనివాసాచార్యులు గారు మాట్లాడుతూ NEP 2020 గురించి వివరించారు. ఈ సదస్సు లో వారు మాట్లాడుతూ ఫౌండేషనల్ స్థాయి పిల్లలలో మనో వికాసం, బుద్ది వికాసం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పిల్లల భౌదిక సామర్ధ్యాల గురించి ఎన్నో విషయాలను వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిల్లల తలిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333