ఐజ అఖిల పక్ష కమిటి ఐజ అభివృద్ధి పనులపై సంపత్ కుమార్ కు వినతి పత్రం అందజేత
జోగులాంబ గద్వాల్ 7 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ అఖిల పక్ష కమిటి తరపున అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, అలంపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సంపత్ కుమార్ కి శాంతి నగర్ క్యాంప్ కార్యాలయంలో అయిజ అభివృద్ధి పనుల నిమిత్తం కలిశాం. రోజురోజుకీ దిన దినాబి అభివృద్ధి చెందుతున్న దశలో ఐజ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతుంది. రోజురోజుకు బహుముఖంగా విస్తరిస్తున్న మొత్తం పట్టణాభివృద్ధిలో మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం.
కనుక కింద పేర్కొన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి ఉంచి ఐజ మండలం అభివృద్ధికి సహకరించగలరని కోరుకుంటున్నాం. ఐజను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయుట.ఐజకు డిగ్రీ కాలేజీ మంజూరు చేయుట చేయుట. ఐజకు కోర్టు మంజూరు చేయుట. ఐజలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు. ఐజలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు.
ఈ కార్యక్రమంలో చాకలి ఆంజనేయులు, దండోరా ఆంజనేయులు, నాగర్ దొడ్డి వెంకట రాములు, ప్రకాష్ గౌడ్, రంగు మద్దిలేటి, ఠాగూర్ కృష్ణ, జగపతి రెడ్డి, డాక్టర్ తాహెర్, తిమ్మప్ప, హనుమంతు, యoకన్న ,తోక నాగన్న, తదితరులు పాల్గొన్నారు.