ప్రభుత్వ విద్యాసంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజా ప్రతినిధులదే

Jun 1, 2024 - 21:47
Jun 1, 2024 - 21:56
 0  3
ప్రభుత్వ విద్యాసంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజా ప్రతినిధులదే

టి పి ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట :- ప్రభుత్వ విద్యాసంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజా ప్రతినిధులదేనని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులు ఉంటేనే పాఠశాలలైన కళాశాలలైన ఉంటాయని .తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలైన ,మండల పరిషత్ ,గిరిజన సంక్షేమ ,జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని . విద్యార్థులే చేరినప్పుడు పాఠశాల అయిన కళాశాలైన మూతబడినట్లే గ్రామ పంచాయతీ ,మున్సిపాలిటీ ,మండల పరిషత్ ,జిల్లా పరిషత్తుల ప్రజాప్రతినిధులు ,శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ,పార్లమెంట్ సభ్యులు మంత్రులు మరియు ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరటానికి తమ వంతు కృషి చేయాలని పౌరస్పందన వేదిక విజ్ఞప్తి చేస్తున్నదని తెలిపారు.
ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను అధ్యాపకులను ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో నియమిస్తున్నారు .ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో అధ్యాపకులతో పాఠాలు చెప్పించడం కూడా రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రజా ప్రతినిధుల బాధ్యత అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది .ఈ కమిటీల చైర్పర్సన్ మరియు కమిటీ సభ్యులందరూ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు నమోదు పెంచుటలో కృషి చేయనున్నట్లు శాసనసభ్యులందరు తమ నియోజకవర్గంలోని చైర్పర్సన్ను సభ్యులను ప్రోత్సహించాలని కోరారు.
ఎంపీటీసీలు ,జడ్పిటిసిలు తమ పరిధిలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ,కళాశాలలో చేరునట్లు ప్రోత్సహించాలి. ఏ రాష్ట్రంలో గాని ,దేశంలో గాని లేనివిధంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలలో చేర్పించిన తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు .అటువంటి తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులు కాస్త భరోసా కల్పిస్తే తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో తమ పిల్లలను చేర్పిస్తారు. ఈ ప్రజాప్రతినిధులే ప్రభుత్వ పాఠశాలల కళాశాలల పని విధానంపై కాస్త శ్రద్ధ వహిస్తే మంచి చదువును అందించే అవకాశం ఉంటుంది సూర్యాపేట జిల్లా ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలంగాణ పౌరస్పందిన వేదిక విజ్ఞప్తి చేస్తుంది
గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ పర్సన్ ని నియమించకుండా ఉపాధ్యాయులే పాఠశాల ను ఊ డ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఉపాధ్యాయుల సర్దుబాటును కూడా సక్రమంగా చేయలేకపోయారు. పిల్లలున్న బడుల్లో టీచర్లు తగిన సంఖ్యలో లేకుండానే ప్రభుత్వము మూడు విద్యా సంవత్సరాలు నడిపింది. సగం పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఊ డ్చేవారు గానీ ,సహాయకులు గాని లేరు .ఈరోజు నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది .జూన్ 12 నుండి పాఠశాల ప్రారంభమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఊ డ్చడానికి తాళాలు వేయడానికి తీయడానికి టాయిలెట్స్ శుభ్రం చేయడానికి సర్వీస్ పర్సన్స్ వెంటనే నియమించాలి ఉపాధ్యాయుల అధ్యాపకుల కొరత లేకుండా ఏర్పాటు చేయాలి. పాఠశాల నిర్వహణ గ్రాండ్ కళాశాల నిర్వహణ గ్రాంట్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఏ మంగ ,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆర్ ధన మూర్తి ,సభ్యులు బి పాపిరెడ్డి సిహెచ్ రమేష్ డి శ్రీనివాస్ చారి ఆర్ శీను, డి బాలాజీ ఏ సీనయ్య ఎన్ సైదా వై లింగయ్య కే రాఘవులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333