పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం

తిరుమలగిరి 26 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా ఇన్ సివిల్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ల లో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు ఆసక్తి కలిగిన పదవ తరగతి ఉత్తీర్ణీలైన విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఆగస్టు 5వ తేదీ వరకు కళాశాల యందు సంప్రదించి అందజేయాలని సూచించారు బాలురకు హాస్టల్ వసతి కలదు పూర్తి వివరాలకు 90102 22177,9704041754 సంప్రదించాలని కోరారు