క్విజ్ పోటీలు గాంధీ జయంతి సందర్భంగా
కె .ఆర్ .ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకోదాడలో "గాంధీ జయంతి సందర్భంగా" విద్యార్థులకు "క్విజ్ పోటీలను" నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులుగా అధ్యాపకులు జి. లక్ష్మయ్య, ఆర్. పిచ్చి రెడ్డి, జి.నాగరాజులు వ్యవహరించారు. మొత్తం 7 టీంలు(గ్రూపులు) పాల్గొనగా... ప్రధమ, ద్వితీయ బహుమతులను గెలుపొందిన వారికి కళాశాల జూనియర్ అసిస్టెంట్ బి. అన్వేష్ వారి తండ్రి జ్ఞాపకార్థం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమణారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఈ పోటీలు అవసరమని అన్నారు. వీటివలన మున్ముందు పోటీ పరీక్షలలో పాల్గొని మంచి ర్యాంకును పొందవచ్చునని, అలాగే ఉద్యోగం కూడా సంపాదించవచ్చని, ఉన్నత చదువులలో మంచి సీటు పొందవచ్చునని, అందుకే నిరంతరం అన్ని సబ్జెక్ట్స్ అధ్యయనం చేయాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు
వేముల వెంకటేశ్వర్లు,
జి.యాదగిరి, ఎం. ప్రభాకర్ రెడ్డి, బాల్త్ శ్రీనివాసరావు,ఆర్. రమేష్ శర్మ, ఎం. రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి.వెంకట్ రెడ్డి, పి.తిరుమల, ఎస్. గోపికృష్ణ, ఎం.చంద్రశేఖర్, ఎస్. కే ముస్తఫా, ఇ.నరసింహారెడ్డి, కె. శాంతయ్య, అన్వేష్,ఎస్. వెంకటాచారి, టి.మమత, డి.ఎస్. రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.