నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

Jan 9, 2026 - 19:09
 0  6
నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జోగులాంబ గద్వాల 9 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల నీట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపాదిత కళాశాలల కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.

మే నెలలో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అదనపు ఎస్పి శంకర్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలుగా ఈ కళాశాలల భవనాలను ప్రతిపాదించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కళాశాలల్లో తరగతి గదులు, నీటి వసతి, విద్యుత్, సీసీ టీవీ కెమెరాల పరిస్థితి, ఇతరత్రా సౌకర్యాలపై సంబంధిత కళాశాలల ప్రధానాచార్యులతో కలెక్టర్ మాట్లాడారు. అదనపు ఎస్పి శంకర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీట్ ప్రవేశ పరీక్ష సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అదనపు  ఎస్పీ కె శంకర్, జిల్లా విద్యా శాఖ అధికారి విజయలక్ష్మి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333