పెద్ద చెరువు కట్ట అందంగా తీర్చిదిద్దాలి ఎమ్మెల్యే
తిరుమలగిరి 10 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని 11వ వార్డులో పెద్ద చెరువు కట్టమీద సుమారు 700 మీటర్ల పొడవున అంచనా మూడు కోట్ల 14 లక్షల 60000 రూపాయలతో మినీ ట్యాంక్ బాండ్ తీరుగా అందంగా తీర్చి దిద్దాలని అధికారులను ఆదేశించారు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ శుక్రవారం రోజున రిజర్వేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ శిలాఫలకం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేసి చూపెడతానన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వర్ ఆలీ డి ఈ రమాదేవి అనిల్ కాంట్రాక్టర్ యాదగిరి యాక స్వామి వర్క్ ఇన్స్పెక్టర్ మండల పార్టీ అధ్యక్షులు ఎల్సూజు నరేష్ జుమ్మిలాల్ సుంకరి జనార్ధన్ చాగంటి రాములు కందుకూరి లక్ష్మయ్య పత్తాపురం సుధాకర్ సంబంధిత అధికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు....