విద్యుత్ సమస్యల పైన ఎస్ఈకి వినతి పత్రం ఇచ్చిన మాజీ సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య
ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక అందజేయాలని ఏడిఈ ఏఈని ఆదేశించిన ఎస్ఈ సుధీర్ కుమార్

అడ్డగూడూరు 23నవంబర్ 2024 తెలంగాణావార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని డిఈ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యుత్ వినయోగ దారుల ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అడ్డగూడూర్ తాజా మాజీ సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఈ సుధీర్ కుమార్ కు పట్టణ విద్యుత్ సమస్యల పైన వినతి పత్రం అందజేసి మా పట్టణం లో 1983లో విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి పాత కరెంటు స్థంబాలు, పాత వైరు, ఇరిగిన పోల్ లు, విధి లో అడ్డంగా ఉన్న పోల్ లు మర్చి నూతనంగా 100 కేవిఏ ట్రాన్ఫర్మర్ లు 4మంజూరు చేసి పట్టణంలో ప్రతి విద్యుత్ పోల్ కు ఐదు వైర్ లు సుమారుగా 6కిలోమీటర్లు లాగినూతన అడ్డగూడూరు మండల కేంద్రం లో నిత్యం విద్యుత్ అంతరాయం కలగకుండా చేసి అలాగే ఇరిగిన విద్యుత్ స్థంబాల స్థానములో కొత్తవి నాటి, రహదారి మధ్యలో ఉన్న స్థంబాలను పక్కకు జరపాలని పక్కన ఉన్న ఆవాస గ్రామ మంగమ్మ గూడెం లో రెండు 25 కేవిఏ ట్రాన్స్ఫర్ లు ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి సమస్య లు లేకుండా చేయాలని, లైన్ లు ఆన్ ఆఫ్ ఏబి స్విచ్ లు ఏర్పాటు చేయాలనీ ఎస్ ఈ సుదీర్ కుమార్ కు మాజీ సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య వివరించడం జరిగింది, వెంటనే అక్కడ ఉన్న మోత్కూర్ ఏడిఈ బాలునాయక్, అడ్డగూడూర్ ఏఈ ఉమాను మీరు మండల కేంద్రానికి వెళ్లి మాజీ సర్పంచ్ తో కలిసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు, త్వరలోనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పటం జరిగింది వెంటనే మాజీ సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య,ఎస్ ఈ సుధీర్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.