తరగతికి ఒక గదిని మరియు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగిరెడ్డి
సూర్యాపేట 22 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలని, తరగతికి ఒక గదిని మరియు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
స్దానిక సూర్యాపేట టిపిటియప్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పి. ముత్తయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిధి గా హజరై TPTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగిరెడ్డి మాట్లాడుతూ బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, సాంకేతిక కారణాలు మరియు ఆప్షన్స్ లో తప్పిదాల జరిగిన ఉపాధ్యాయుల ఆప్పీల్స్ ను పరిష్కరించాలని, పదోన్నతుల్లో మిగిలిన పాఠశాల సహాయకుల ఖాళీలను కౌన్సింగ్ జరపాలని, 317 మ్యుచవల్ ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలని,కెజిబివి ఉపాధ్యాయునీ మరియు సిబ్బంది బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను , డి.ఎ. లను వెంటనే విడుదల చేయాలని, పి.ఆర్.సి కమిటీ రిపోర్ట్ వెంటనే తెప్పించి మెరుగైన పిట్ మెంట్ తో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి CH. బిక్షం,రాష్ట్ర కౌన్సిలర్స్ SK.M సుభాని, R. ప్రతాప్,T పూలన్, P రవికుమార్,జిల్లా కార్యదర్శులు యాకయ్య, M కృష్ణమూర్తి, పోతురాజు నర్సయ్య, జాన్ సుందర్, బడుగుల సైదులు. D యాదగిరి,జానయ్య D కోటేశ్వర రావు, శ్యామ్ కుమార్, అశోక్, తూము శ్రీనివాస్, R మహేందర్ తదితరులు పాల్గొన్నారు