కొత్త ఎమ్మార్వో ఆఫీసును ఎంపీడీవో ఆఫీసు భవనాలనుకొత్త రాజోలి నిర్మించాలి 

Jan 9, 2026 - 19:05
 0  23

జోగులాంబ గద్వాల 9జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : రాజోలి.: తుంగభద్ర నది ఒడ్డున ఉన్న రాజోలి గ్రామం 2009లో భీభత్సమైన వరదలకు గురైంది. ఆ సమయంలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం గ్రామానికి దూరంగా కొత్త రాజోలి గ్రామాన్ని ఏర్పాటు చేసింది.కొత్త ప్రాంతంలో స్థిరపడ్డ తర్వాత, గ్రామ ప్రజల ఆందోళనలతో రాజోలి గ్రామం మండల కేంద్రంగా మారింది. ప్రస్తుతం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలనే ప్రణాళికలు అమలులో ఉన్నాయి.కానీ కొంతమంది ఈ కొత్త భవనాలను పాత రాజోలి గ్రామ పరిధిలోనే నిర్మించాలని కోరారు. దీనిపై ఈ రోజు గ్రామస్తులు నిరసన చేపట్టి, కొత్త రాజోలి గ్రామంలోనే కార్యాలయాలను నిర్మించాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.

 ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు  గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333