జాతర సమీపిస్తున్న రోడ్ల పరిశుభ్రత ఏది వెలగని ఎల్ఈడి బల్బులు
జోగులాంబ గద్వాల డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్ నడిగడ్డ లోని ప్రసిద్ధమైన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా గ్రామ రోడ్లు అపరిశుభ్రంగా నెలకొని ఎక్కడ చెత్త అక్కడ ఉంది. ముఖ్యంగా మెయిన్ రోడ్డు పరిశుభ్రత లేకపోవడంతో చెత్తాచెదారంతో నిండి ఉంది. దేవాలయానికి వెళ్లే ముఖ్య రహదారుల పరిస్థితి గుంతల మయంగా మారు వాహనదారులకు ఇబ్బంది నెలకొంది. దేవాలయానికి వెళ్ళే రహదారులు సెంట్రల్ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయగా వాటిలో ఒక బలుపు కూడా వెలగడం లేదని తెలిసింది. గతంలో సర్పంచులు ప్రతిష్టకు భంగం కలగకుండా జాతరను విజయవంతంగా నడిపించేందుకు రహదారులు త్రాగునీరు లైట్లు పరిశుభ్రత తగు చర్యలు తీసుకొని విజయవంతం చేశారు. కానీ సర్పంచులు లేనందున ప్రత్యేక అధికారి గ్రామ కార్యదర్శి లే బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వారి అడ్రస్ లేదని జాతరలో దుకాణాలకు కనీసం బార్డర్ చేయాల్సి ఉండగా ఎక్కడపడితే అక్కడ దుకాణాలు వేయడంతో జాతరలో భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుందని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని రోడ్లు, పరిశుభ్రత, త్రాగునీరు, లైట్లు తదితర వాటిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.