అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై--సీఎం స్పందించాలి
రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
నేటి నుండి నిర్వహించే సీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం గురించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సోమవారం ఒక ప్రత్యేక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా నడుస్తున్న జర్నలిస్టుల సమస్యలు అసెంబ్లీలో చర్చించే ప్రధాన సమస్యలో ఒకటిగా భావించి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు,ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు చర్చ జరపాలని కోరారు.ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను మర్చిపోకుండా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి పక్కా ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని యాదగిరి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ప్రెస్ క్లబ్ భవనాలు లేక జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ప్రాంతాలను గుర్తించి వెంటనే అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు కొమ్ము కాసే కొన్ని మీడియా సంస్థల వ్యవహార శైలితోనే ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలపై పట్టి పట్టనట్టుగా సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని ఆరోపించారు.వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు వెంటనే అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేయాలని ఒక యూనియన్ జర్నలిస్టులకు మాత్రమే న్యాయం చేసే విధంగా ప్రెస్ అకాడమీ నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ లో ఉన్న సుమారు 30 వేల మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు