ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్

Nov 12, 2024 - 19:25
 0  3
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్

జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇటిక్యాల‌ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ‌ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణతో కలిసి జిల్లా కలెక్టర్ ‌ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని‌ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి రానున్న ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. కలెక్టర్ స్వయంగా తేమ శాతాన్ని డిజిటల్ తేమ మీటర్ ద్వారా టెస్ట్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు తేమ శాతాన్ని చెక్ చేయడంతో పాటు, తాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు  రూ. 2820/- తొ పాటు రూ. 500 బోనస్ ఇవ్వనున్న వివరాలు తెలిపే విధంగా చార్ట్‌ను రూపొందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా ప్యాడీ క్లినర్, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఓపీఎంఎస్‌ లో నమోదు చేయాలని కలెక్టర్‌ సూచించారు. తూకం చేసిన ధాన్యం సంచులను వెంటనే రైస్‌ మిల్లర్లకు తరలించే విధంగా ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా  పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, అడిషనల్ డిఆర్డివో  నర్సింహులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333