ట్రాఫిక్కు ఇబ్బందిగా మారిన లారీలు

జోగులాంబ గద్వాల 9 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ఐజ రహదారిలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ సంబంధించిన గోడౌన్లలో సరుకులు స్టోరేజ్ చేసేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లారీలు రోడ్లపై ఉండడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది నెలకొంది. నిత్యం వందలాదివాహనాలతో ఐజ గద్వాల రోడ్డు ట్రాఫిక్ తో సతమతం అవుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. గోడౌన్ కి సంబంధించిన హమాలీలు త్వరగా స్టాక్ ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఇతర హమాలీలను నియమించుకొని లారీ సరుకులు అన్లోడ్ చేయాలని పలువురు ప్రయాణికులు సూచిస్తున్నారు.