చందుపట్ల గ్రామములో మానసిక వికలాంగురాలు పై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

Sep 19, 2024 - 19:42
 0  56
చందుపట్ల గ్రామములో మానసిక వికలాంగురాలు పై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

వికలాంగుల పరిరక్షణ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చెయ్యాలి! 

బాద్యురాలికి 5లక్షల పరిహారం అందించాలి! 

NPRDజిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  సురూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ డిమాండ్ 


భువనగిరి 19 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- భువనగిరి మండలం చందుపట్ల గ్రామములో ఇటీవల మానసిగా వికలాంగురాలి పై అదే గ్రామానికి చెందిన వ్యక్తి మధ్యాహ్న సమయములో లైంగిక దాడికి పాల్పడడం జరిగిందని వారు ఈ సందర్బంగా ఆరోపించారు ఇంత దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎంపీఆర్ డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  సురూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతని పై వికలాంగుల పరిరక్షణ చట్టం -2016 ప్రకారం సెక్షన్ 91&92 ప్రకారం కేసు నమోదు చెయ్యాలని వారు డిమాండ్ చెయ్యడం జరిగింది . బాధితురాలిపై 5లక్షల పరిహారం అందివ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యడం జరిగింది. ఇవ్వలేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులను ఐక్యం చేసి న్యాయం జరిగేవరకు పోరాడుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.ఈ సందర్బంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా మహిళా కన్వినర్ కొత్త లలిత మాట్లాడుతూ మహిళా వికలాంగుల పై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని,లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి భువనగిరి మండల నాయకులు శ్రీహరి,లక్ష్మయ్య తదితరులు పాల్గొనారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333