జ్యోతిర్ముడితో శ్రీశైలం కి బయలుదేరిన శివస్వాములు...!
శివనామస్మరణతో మార్మోగిన చర్ల గార్లపాడు గ్రామము...!
జోగులాంబ గద్వాల్ 2 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. మండలం చర్ల గార్లపాడు గ్రామంలో శివస్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు,మార్చి 08న మహాశివరాత్రి సందర్భంగా మండల దీక్ష,అర్ధ మండల దీక్ష స్వీకరించిన శివ స్వాములు ఈ దీక్షావిరమణ సమయంలో జ్యోతిర్ముడిని శ్రీశైలంలో సమర్పిస్తారు. శనివారం తెల్లవారుజామున శివుడికి అభిషేకాలు నిర్వహించి,అనంతరం జ్యోతిర్ముడి వేసుకొని చెర్ల గార్లపాడు గ్రామం నుంచి శివ స్వాములు 25మంది శ్రీశైలంకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్ని ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.వీరిని గ్రామంలోని ప్రజలు శివ భక్తులు, శివనామస్మరణతో ఊరేగింపుగా తిరిగి పూజలు నిర్వహించారు...!
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, శివ భక్తులు, చిన్నారులు మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు...!