గొర్రెల మందలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ 8 గొర్రెలు మృతి

Oct 14, 2025 - 23:57
 0  1
గొర్రెల మందలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ 8 గొర్రెలు మృతి

తిరుమలగిరి 15 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులో  దారుణ ఘటన చోటుచేసుకుంది. తొండ గ్రామానికి చెందిన చిన్నబోయిన ముత్తయ్య యాదవ్ రోజు మాదిరిగానే గొర్రెలను మేతకోసం తీసుకెళ్లిన గొర్రెల కాపరి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా, అతివేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ (నంబర్ TG 29 T 4541, ట్రాలీ నంబర్ 7429 T 4540) గొర్రెల మందలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడు గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది గొర్రెలు తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్నాయి. ఈ ప్రమాదంతో గ్రామంలో ఆందోళన వ్యక్తమైంది. బాధిత గొర్రెల కాపరి సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొంటూ, ట్రాక్టర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి