గంజాయి డ్రగ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్మూలించాలి.... కోటా రమేష్

May 27, 2024 - 18:45
May 27, 2024 - 18:56
 0  8
గంజాయి డ్రగ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్మూలించాలి.... కోటా రమేష్

మునగాల 27 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- భావితరాలకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేటి యువత గంజాయి ఊబిలో చిక్కుకొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో సుందరయ్య భవనము లో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు, యువత నిర్ణీత లక్ష్యాలతో ముందుకు సాగాల్సిన వారని, కాగా నేడు గంజాయికి బానిసలుగా మారుతున్నారని, దేశవ్యాప్తంగా ఆల్కహాల్‌ తరవాత ఎక్కువ మంది గంజాయికి వ్యసనపరులుగా మారుతున్నారని, అందులో ముఖ్యంగా యువత ఉన్నారన్నారు.

  వారి పిల్లల భవిష్యత్తు ఎంటో తెలియని స్థితిలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారని ఆయన వాపోయారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించే విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ గంజాయి విక్రయదారులు రెచ్చిపోతున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో గంజాయితో పట్టుబడ్డ నిందితుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోందని, భావితరం గంజాయి ఊబిలో కూరుకుపోతోందని తెలియజేశారు. తొలుత ఆ మత్తుకోసం, అనంతరం దాని ద్వారా ధనం సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతూ నేటి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటటూ తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని మిగులుస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని నిర్మూలించడంలో ఉపేక్షించక మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి చర్యలు చేపట్టి భావితరాలకు బంగారు భవిష్యత్తును నిర్మించాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State