అడ్డగూడూరులో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

Jan 3, 2025 - 15:35
Jan 3, 2025 - 15:54
 0  9
అడ్డగూడూరులో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

అడ్డగూడూరు 03 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 194వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్త్రీ సమాజానికి నిరంతరం కృషి చేసిన దేశానికి తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే సేవలు చిరస్మరణీయమని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శుక్రవారం నాడు 194వ జయంతి సందర్భంగా  బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో అడ్డగూడూరు మండల కేంద్రంలో తెలంగాణ విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..సమ, సమాజం కోసం నిరంతరం పాటు పడిన  గొప్ప వ్యక్తి సావిత్రి పూలే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తుప్పతి బీరప్ప, జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, మండల ఇంచార్జి పూజారి సైదులు బుర్ర అనిల్ కుమార్ , గూడెపు పాండు, నాగులపల్లి బీరప్ప, సురేష్, దామోదర్, అవిలయ్య తదితరులు పాల్గొన్నారు.