హోలీ నుండి మొదలుకానున్న జన జాతర""నేలకొండపల్లి లో

Mar 12, 2025 - 19:00
Mar 12, 2025 - 19:47
 0  29
హోలీ నుండి మొదలుకానున్న జన జాతర""నేలకొండపల్లి లో

చెరువు మాదారం అంకమ్మ తల్లి ని దర్శించిన దేవాదాయ శాఖ అధికారులు.

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : జాతర సందర్భంగా గ్రామస్తుల వినతి మేరకు పరిశీలన  హోలీ నుండి మొదలుకానున్న జన జాతర 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువు మాదారం గ్రామంలో కొలువై ఉన్న అంకమ్మ తల్లి దేవాలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు సందర్శించి గ్రామస్తులతో చర్చించారు. గత కొన్ని ఏళ్లుగా దేవాలయ ఆలయ పాలన జాతర వంటి కార్యక్రమాలు గ్రామానికి చెందిన ఒక కుటుంబం నిర్వహిస్తుందని దేవాలయానికి సుమారు రెండు ఎకరాల భూమి కూడా ఉన్నదని గ్రామస్తులు దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలపై స్పందించిన దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఈ వెంకటేశ్వరరావు నేలకొండపల్లి ఈవో శ్రీకాంత్ లు జాతర ముగిసిన తర్వాత గ్రామస్తులు భక్తులు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కార్యాలయంకు వచ్చి లిఖితపూర్వకంగా తెలియపరచాలని ఆ మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ విషయంపై తెలంగాణ వార్త ఖమ్మం  ప్రతినిధి రా వెళ్ళ వివరణ కోరగా దేవాలయాన్ని సందర్శించిన మాట వాస్తవమేనని జాతర ఐదు రోజులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని భావించి జాతర తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State