నాగారం బంగ్లాలో మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు.
నాగారం జూలై 4: తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల మరియు సినిమా ఆటోగ్రాపి శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దోనకొండ రమేష్ ఆధ్వర్యంలో గురువారం నాగారం బంగ్లాలో శాలువాతో సన్మానించి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నాగారం బంగ్లాలోని ఇన్స్పెక్షన్ బంగ్లా శిథిలావస్థకు చేరిందని దాని తొలగించి రెండు కోట్ల తో పునర్నిర్మానం చేపడతామని దానితోపాటే ప్రజావసరాలు నిమిత్తం మరో రెండు భవనాలు ప్రభుత్వ ఆఫీసుల కోసం నిర్మాణం చేపడట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. నాగారం మండల కేంద్రానికి ప్రత్యేకంగా పేదల కోసం 300 ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో ఒక నాయకుడు తన స్వలాభం కోసం వరద ఊరి పైకి వచ్చేలాగా ఆనకట్టలు కట్టి ఎత్తైన భావన నిర్మించుకున్నాడని ఎద్దేవా చేశారు. అనంతరం ఇటీవల పసునూరు పాల సంఘం చైర్మన్ ఎన్నికైన బిక్కీ శ్రీను ను మంత్రి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ రెడ్డి ఓరుగంటి సత్యనారాయణ కడారి సోమయ్య కన్నెబోయిన వెంకట బిక్షం జాజుల వీరయ్య ముకుంద రెడ్డి యాదవ రెడ్డి కొంపెల్లి శ్రీను ఉపేందర్ సూరయ్య రాములు ఏక స్వామి జలంధర్ ప్రవీణ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.