శ్రీధర్ రెడ్డి హత్యపై డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు
27-05-2024 తెలంగాణవార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి హత్య పై డీజీపీని కలిసిన బిఆర్ఎస్ నేతలు. చిన్నంబావి మండలం లోని లక్ష్మిపల్లి గ్రామంలో బుధవారం రోజు రాత్రి జరిగిన హత్య విషయం గూర్చి హత్య జరిగి 5 రోజులు అవుతున్న ఇప్పటివరకు కూడా పోలీసులు నిందితులు ఎవ్వరు అనేది ఇప్పటివరకు స్థానిక పోలీసులు ఎవరిని అరెస్టు చేయలేదు, స్థానిక పోలీస్ యంత్రాంగం మీద మాకు నమ్మకం లేదు అని శ్రీధర్ రెడ్డి తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేయలేదు అరెస్టు చేయలేదు మాకు స్థానిక పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు అని ఈరోజు డీజీపీ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి శేఖర్ రెడ్డి. వారితోపాటు నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు, వీరందరూ డీజిపి ని కలిసి శ్రీధర్ రెడ్డి హత్య మీద పూర్తి విచారణ చేయించి దోషులను శిక్షించాలని కోరడం జరిగింది. వీరితోపాటు మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ, జిల్లా ప్రాదేశిక సభ్యురాలు కేస్ రెడ్డి వెంకటరమణమ్మ చిన్నారెడ్డి, మాజీ సర్పంచులుగోవిందు శ్రీధర్ రెడ్డి,మద్దిలేటి,రామస్వామి, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు కలవడం జరిగింది.