కొత్త రేషన్ కార్డులు వెంటనే అమలు చేయాలి

Sep 28, 2024 - 21:14
Sep 28, 2024 - 21:17
 0  5
కొత్త రేషన్ కార్డులు వెంటనే అమలు చేయాలి
కొత్త రేషన్ కార్డులు వెంటనే అమలు చేయాలి

 వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలకు

కొత్త పింఛన్లు అందించాలి

 సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్

రామన్నపేట 28 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పరిధిలో సర్నేనిగూడెం గ్రామ సిపిఎం పార్టీ మహాసభలు అబ్బాయిగూడెం  గ్రామంలో వికలాంగుల సమావేశాలు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశనికి అధ్యక్షునిగా గంగాదేవి అంజయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్ మహాసభలను ఉద్దేశించి  మాట్లాడుతూ..ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రాంగానే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రేషన్ కార్డులు లేనివారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ వితంతులకు  ఒంటరి మహిళలకు పెన్షన్ 4వెలు రూపాయలు వికలాంగులకు 6వేల రూపాయలు పెన్షన్ పెంచి  ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచిన ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకంటే సర్నేని గూడెం  గ్రామపంచాయతీ ఉన్న గ్రామాలలో చాలామంది నిరుపేద ప్రజలు ఉన్నారని కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఒంటరి మహిళలకు వికలాంగులకు పెన్షన్  అందించాలని సర్నేనిగూడెంలో రైతు రుణమాఫీ అందరికీ అందలేదు వెంటనే అందరికీ ఇవ్వాలని సర్నేనిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఇండ్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం సిపిఎం పార్టీ గ్రామ నూతనకాదర్శిని గంగాదేవి మల్లేశం సహాయ కార్యదర్శిగా రమణ పోయిన శివ గార్లని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో కావలి శంకరయ్య,గంగాదేవి లింగయ్య, గంగాదేవి కొండల్ గంగాదేవి నరసింహ,గంగాదేవి రవి, గంగాదేవి నరసింహ తదితరులు పాల్గొన్నారు.