చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి
ఆదివారంతో 30 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో... సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ‘దార్శనికతలో చంద్రబాబుకు ఎవరూ సాటి రారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన, చేస్తున్న విధానాలను అనేక రాష్ట్రాలు అనుకరిస్తున్నాయి’ అని చెప్పారు. శుక్రవారం ఆయన, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్బాబు, తెదేపా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు పార్టీ కార్యాలయంలో ఈ అంశంపై విలేకర్లతో మాట్లాడారు.