మంత్రి నారా లోకేశ్ ఛైర్మన్ గా కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు
ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ రెండింటి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవోను విడుదల చేసింది. ఫోరం ఛైర్మన్ గా మంత్రి లోకేశ్ ఉండనున్నారు.పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ ఫోరం పనిచేయనుంది. ప్రభుత్వశాఖలను ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది.