నిన్న నాపై వచ్చిన ఆరోపణ పత్రిక కథనాన్ని సవాలు చేస్తూ బహిరంగ చర్చకు సిద్ధం
రావెళ్ల కృష్ణారావు
నిన్న నాపై వచ్చిన పత్రికా కథనాన్ని సవాలు చేస్తూ బహిరంగ చర్చకు సిద్ధం ????
నాకు 3 లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యింది అని మన గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు ఒక ప్రముఖ పత్రిక వారికి తప్పుడు సమాచారం అందించి నాపై అసత్యఆరోపణలతో కూడిన కధనం ప్రచురించుటకు ప్రేరేపించారు...సదరు వ్యక్తి మన గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు అని ఆ పత్రిక వారు నాకు తెలిపారు
ఇట్టి కథనాన్ని సవాలు చేస్తూ సొసైటీ లో నాకు గానీ నా భార్యకి గానీ ఎన్ని లక్షలు అప్పు ఉంది...ఎంత రుణమాఫీ అయ్యింది అనేది మన గ్రామంలోని సొసైటీ చైర్మన్ గానీ, సెక్రటరీ గానీ సంబంధిత అధికారులతో బహిరంగ చర్చకు వస్తే వాస్తవాలు వెలికి వస్తాయని కోరుకుంటు...
నాకూ రెండు రేషన్ కార్డులు రెండు ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు...వాటిని నిరూపించని యెడల అట్టి కథనాలను ప్రచురించిన పత్రిక పై మరియు వ్యక్తిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిస్తున్నాను
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నాపై అసత్య ఆరోపణలు చేసి మీరు లబ్ధిపొందాలనుకోవడం మీ అవివేకం నాపై వచ్చిన అసత్య ఆరోపణలు నివృత్తి చేయడానికి నేను బహిరంగ చర్చకు సిద్ధం...మీరు సిద్ధమా..??