ఆన్లైన్ పేరుతో మోసాలు యువకుడు అరెస్ట్
తిరుమలగిరి 07 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు చేస్తున్న వ్యక్తిని ఎస్సై శివతేజ పట్టుబడి చేసి అరెస్టు చేశారని సూర్యాపేట పట్టణ సిఐ ఏ వెంకటయ్య తెలిపారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత కొద్దిరోజులుగా సూర్యాపేట పట్టణం, తిరుమలగిరి ప్రాంతాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో, జాబులు ఇప్పిస్తామని నాకు చాలామంది రాజకీయ నాయకులు, అధికారులు తెలుసు అని ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నాడని తెలిపారు. ఇతను పేరు గడ్డం లక్ష్మణ్ కుమార్, తండ్రి రాములు, నివాసం భాష నాయక్ తండా, నివాసి అని తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ మూడు కోట్ల రూపాయలు వరకు కాజేశాడని తెలిపారు. ఎవరైనా అమాయకపు ప్రజల్ని మోసం చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.