ముఖ్యమంత్రి పుట్టిన ఊళ్లో మహిళా జర్నలిస్ట్ లను కొట్టి, అసభ్యంగా ప్రవర్తిస్తారా?
ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ?
వందశాతం రుణమాఫీ నిజమైతే...అంత భయమెందుకు?
మహిళ జర్నలిస్ట్ లపై దాడి చేసిన వాళ్లపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్
మహిళా జర్నలిస్ట్ లపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన :-
మాజీ జడ్పీటీసీ బాసు శ్యామల, హనుమంతు నాయుడు
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్ని బాసు శ్యామల,హనుమంతు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు...
ఈ సందర్భంగా బాసు శ్యామల మాట్లాడుతూ...
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లపై దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి... మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇద్దరు మహిళ జర్నలిస్ట్ లు ఏం తప్పు చేశారు.కొండారెడ్డి పల్లెలలో రైతులకు రుణమాఫీ జరిగిందా అని తెలుసుకోవటానికి వెళితే...కాంగ్రెస్ గుండాలు దాడి చేయటమేమిటనీ ప్రశ్నించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా బురదలో నూకేసి, కొట్టి, అసభ్యంగా ప్రవర్తించి వాళ్లకు అవమానం చేయటం ఎంత హేయమని అని అన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే...రుణమాఫీ వంద శాతం చేసింది నిజమైతే ఎందుకు భయం? ఎందుకు నువ్వు పుట్టిన ఇంటి ముందట ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేశావని ప్రశ్నించారు. మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపైన వెంటనే కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ కూడా ఈ దాడిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.