ప్రజావాణి ఫిర్యాదు స్వీకరణ ఎస్పీ.
జోగులాంబ గద్వాల 1 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పై బాధితుల నుండి వచ్చిన 16 అర్జిలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. అలాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల, మహిళలకూ వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ రోజు వచ్చిన పిర్యదులలో భూమి ఆక్రమణకు సంబందించి -8 పిర్యాదులు. ఇంటిని ఇతరులు ఆక్రమించడం గురించి - 3 పిర్యాదులు. పంటను ధ్వంసం చేయడం గురించి - 01 పిర్యాదు. ఇంటి ప్రక్కను ప్లాట్ లో మురుగు నీరు నింపడం గురించి - 01 ఫిర్యాదు. వడ్డేపల్లి లోని 3 వ వార్డు లో ప్లాట్లు వేసుకొని వేసిన వెంచర్ లో వసతులు కల్పించక పోవడం గురించి - 1 పిర్యాదు. ఇతర అంశాలకు సంబంధించి -02 పిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు.