అర్హత లేని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి..

Jul 1, 2024 - 20:20
 0  5
అర్హత లేని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి..

జిల్లాలో అర్హత లేని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను అక్రమ పద్ధతిలో ఎంప్యానల్లో చేర్చారని, అర్హత లేని ఏజెన్సీలను రద్దు చేసి అర్హత గల ఏజెన్సీల సర్వీస్ లను  రెన్యూవల్ చేయాలని జిల్లా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహకులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు  వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అక్టోబర్ లో జిల్లాలోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంప్యానల్లో చేర్చుటకు టెండర్ నిర్వహించారని, ఈ టెండర్లో 40 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోగా 36 ఏజెన్సీలను అర్హుల గుర్తించారని తెలిపారు. అయితే జిల్లాలో అదనపు కలెక్టర్ గా   విధులు నిర్వహించిన వెంకటరెడ్డి, ప్రస్తుత ఎంప్లాయిమెంట్ అధికారి అక్బర్ అబీబ్ టెండర్ పాల్గొనని శ్రీ షిరిడిసాయి, ఏకలవ్య, కేకేఆర్ ఏజెన్సీలను కూడా ఇటీవల ఎంప్యానల్ చేర్చి తమ వద్ద సర్వీస్లను అక్రమంగా వారికి అంటకట్టారనీ వారు తెలిపారు. అక్రమపద్ధతిలో ఎంప్యానల్లోకి వచ్చిన ఏజెన్సీలను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంప్యానల్లో ఉన్న ఏజెన్సీల నిర్వహకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333