రైల్వే ప్రమాదం దురదృష్టకరం.

Jun 18, 2024 - 20:26
Jun 18, 2024 - 20:27
 0  13
రైల్వే ప్రమాదం దురదృష్టకరం.
రైల్వే ప్రమాదం దురదృష్టకరం.

రైల్వే శాఖ మంత్రి ని భర్తరఫ్ చేయాలి. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు.

జోగులాంబ::(వడ్డేపల్లి)::- పశ్చిమ బెంగాల్ లోని న్యుజల్సాయిగుడి రైల్వే ప్రమాదం దురదృష్టకరమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన వడ్డేపల్లి మండల పరిధిలోని జిల్లేడుదిన్నే గ్రామంలో ముఖ్య కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఒక ఏడాదిలోనే నాలుగు రైల్వే ప్రమాదాలు జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమైనని ఈ  సంధర్భంగా ఆయన  అన్నారు. ఒడిస్సా లోని బాలసోర్ రైల్వే ప్రమాద ఘటనలో సుమారు 290 మందికి పైగా ప్రజలు చనిపోయారని అన్నారు. అదేవిధంగా విజయనగరం రైల్వే ప్రమాద ఘటనలో సుమారు 14 మంది చనిపోయారని ఆయన పేర్కొన్నారు.2024 జూన్లో పంజాబ్లో జరిగినా రైల్వే ప్రమాద ఘటనలో పలువురు గాయపడడం జరిగిందని.. దీనికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రైల్వే ప్రమాద ఘటనలకు కేంద్ర ప్రభుత్వం మీద పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రజలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క బాధ్యత కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా తో పాటు ఉద్యోగ సౌకర్యాలను కలగజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలను చెల్లించాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి  రూ.60 లక్షలు చెల్లించడంతోపాటు.. మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించాలని డిమాండ్ చేశారు.అంతకుముందు మృతులకు మౌనం వహించి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో మండల నాయకులు డేవిడ్, రమేష్, రవి,జాన్, సిద్ధార్థ్, భీముడు ఇతరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333