జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిసిన ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( సీబీఎస్ఈ ) విద్యార్థులు

Dec 24, 2025 - 19:27
 0  4
జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిసిన ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( సీబీఎస్ఈ ) విద్యార్థులు
జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిసిన ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( సీబీఎస్ఈ ) విద్యార్థులు

విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తు...! సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.

                - చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి.

 జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. జిల్లా కేంద్రంలో  ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025 -26 లో భాగంగా జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రాజెక్ట్ల ప్రదర్శన లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు, డీఈఓ విజయలక్ష్మి  చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం జరిగినది. విజేతలుగా గెలుపొందిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి అభినందిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు.

 గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమంటూ మొదటి బహుమతులు  మేధా శ్రీ, లోహిత, రెండవ బహుమతులు అన్సు శ్రీ, కుందన, మూడవ బహుమతులు ఎం.డి సోహెల్, నిక్షిత, నవనీత, కృష్ణ సాయి, రోహిణి, లను అభినందించి  ఉపాధ్యాయులను కూడా అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ సుధీర్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ మహిమ శ్రీ పాఠశాల అధ్యాపకులు లోకేష్, నవీన్,సంతోషి, చందన, చైతన్య, ప్రేమ కుమారి, రంజని, వనజ, ఏనాథ్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333