గుండె సంబంధిత పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
గుర్తించలేని వ్యాధులను గుర్తించి అప్రమత్తం చేసేందుకే వైద్య పరీక్షలు
ఆర్వి ఆసుపత్రి ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ గౌడ్
ఈసీజి. 2డిఇకో పరీక్షల ద్వారా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్త పడవచ్చని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్ వి ఆసుపత్రి ప్రముఖ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్వి ఆసుపత్రిలో రూ. 3000లు ఖర్చు అయ్యే ఈసీజి, 2డిఈకో, రక్త, బీపీ, షుగర్ పరీక్షలను రూ 999లకే నిర్వహించి మాట్లాడారు. జ్వరం, ఇతర వ్యాధులు వస్తే చికిత్స తీసుకుంటే తగ్గుతాయని కానీ గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందన్నారు. ప్రజలు చాలా వరకు ప్రాణం మీదకు వచ్చే వరకు ఇలాంటి వ్యాధులను గుర్తించలేరని అన్నారు. ఈ వ్యాధులను ముందుగా గుర్తించేందుకు ప్రజలకు అందుబాటు ధరలో ఈ పరీక్షలను నిర్వహించి ఒక వేళ గుండె, కిడ్నీ సంబంధిత జబ్బులు ఉంటే ముందుగా అప్రమత్తం చేసి భవిష్యత్తులో ఎలాంటి భయం లేకుండా చేస్తున్నామన్నారు. బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి రోగి స్థితిని బట్టి మందుల డోస్ పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందన్నారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ప్రియాంక, జనరల్, సర్జన్ డాక్టర్ శాంత్, క్రిటికల్ కేర్ డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.