సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఉద్యోగులకు కనీస వేతనం నెలకు 21వేలు ఇవ్వాలి
నెమ్మాది వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి
సూర్యాపేట పట్టణం లోని పబ్లిక్ క్లబ్ ఉద్యోగులూ ఏండ్ల తరబడి పని చేస్తున్న పబ్లిక్ క్లబ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయక పోవడం అన్యాయమనీ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అవేదన వ్యక్తం చేశారు...
శుక్రవారం నాడు పబ్లిక్ క్లబ్ ఉద్యోగుల సీఐటీయూ అనుబంధంగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రిజిస్టర్ సర్టిఫికేట్ ను ఉద్యోగులకు సీఐటీయూ జిల్లా కార్యాలయం సీఐటీయూ జిల్లా అద్యక్షుడు ఎం రాంబాబు తో కలసి అందజేశారు... ఈ సంధర్బంగా నెమ్మాది మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పబ్లిక్ క్లబ్ ఉద్యోగులకు రెండు సంవత్సరాల కోక సారి వేతన సవరణ చేయాల్సి ఉందనీ కానీపబ్లిక్ క్లబ్ కమిటి యాజమాన్యం కార్మికుల వేతనాలు పెంచాలని ఆలోచన రాక పోవడం అన్యాయం ఆన్నారు.. క్లబ్ లో స్వీపర్ దగ్గర నుండి అటెండర్, వాచ్ మన్, స్కా, ఎలక్ట్రీషియన్, దోబి, తోటమాలి వరకు ఏండ్ల తరబడి 15వేలు వేతనాలు లోపు మాత్రమే ఇస్తున్నారని ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు చూస్తే ఇచ్చే జీతాలు ఏ మూలకు కూడా సరిపోవని అయన అవేదన వ్యక్తం చేశారు... ఉదయం నుండీ రాత్రీ వరకు కాల పరిమితి లేకుండా పని చేస్తున్నారని,అలాంటప్పుడు పనికి తగ్గ ఇవ్వాలి కదా అని ఆయన ప్రశ్నించారు.... ఇప్పటికైన పబ్లిక్ క్లబ్ యాజమాన్యం ఆలోచించి మార్చి నెలలో నూతన వేతన సవరణ ఒప్పందం చేయాలనీ నెమ్మాది కోరారు...
క్లబ్ లో పని చెసే ఉద్యోగునికి కేటగిరీ వైజ్ గా నెలకు 21 వేలు వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని, సoవత్సరానికి రెండు జతల బట్టలు, పండగ అలవెన్సులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ నెమ్మాది కోరారు.. ఈ సమావేశం లో యూనియన్ నాయకులు ముత్తయ్య, రవి, ప్రసాద్, నర్సయ్య, సైదులు జానయ్య,తదితరులు పాల్గొన్నారు